– మిజోరంతో హైదరాబాద్ ఢ నేడు
హైదరాబాద్ : రంజీ ట్రోఫీ మాజీ చాంపియన్ హైదరాబాద్ అజేయ రికార్డుపై కన్నేసింది. ప్లేట్ గ్రూప్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించిన హైదరాబాద్ 28 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకున్న హైదరాబాద్.. లీగ్ దశలో అజేయంగా నిలవాలని భావిస్తుంది. నాలుగు మ్యాచులను రెండు రోజుల్లోనే ముగించిన హైదరాబాద్ నేడు మిజోరంతో తలపడనుంది. ఉప్పల్ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు రాహుల్ సింగ్ నాయకత్వం వహించనున్నాడు. తన్మరు అగర్వాల్, రోహిత్ రాయుడు, చందన్ సహాని సహా చామ మిలింద్, రవితేజ, కార్తికేయలపై ఫోకస్ కనిపిస్తుంది. గత మ్యాచ్‌లో రికార్డు ట్రిపుల్ సెంచరీ బాదిన తన్మరు అగర్వాల్.. నేడు మరో భారీ ఇన్నింగ్స్‌పై కన్నేసి బరిలోకి దిగుతున్నాడు. హైదరాబాద్, మిజోరం రంజీ మ్యాచ్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం.