ప్రేక్షకుల హృదయాల్లో నిలిచేలా …

ప్రేక్షకుల హృదయాల్లో నిలిచేలా ...మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమార్‌ నటించిన ‘ది గోట్‌ లైఫ్‌’ (ఆడు జీవితం) సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందని సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ అన్నారు. మార్చి 28న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వరల్డ్‌ క్లాసిక్‌ మూవీ ‘లారెన్స్‌ ఆఫ్‌ అరేబియా’ మాదిరిగా ఈ సినిమా ఉంటుందని అన్నారు. మార్చి 10న ఆడియో విడుదల పెద్దఎత్తున చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. హాలీవుడ్‌ నటుడు జిమ్మీ జీన్‌ లూయిస్‌, అమలాపాల్‌, కెఆర్‌ గోకుల్‌, అరబ్‌ యాక్టర్స్‌ తాలిబ్‌ అల్‌ బలూషి, రిక్‌ ఆబే ఇతర కీలకపాత్రల్లో నటించారు. బెన్యామిన్‌ రాసిన ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్‌ బ్లెస్సీ రూపొందించారు.