వాళ్ళకు డాకు.. నాకు మహారాజ్‌

Daku for them.. Maharaj for meబాలకష్ణ, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్‌’. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ డల్లాస్‌లో ఘనంగా జరిగింది. 2 నిమిషాల 44 సెకన్ల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. భిన్న కోణాల్లో కనిపిస్తున్న బాలకృష్ణ పాత్రతోపాటు సంగీతం, ‘చెడ్డవాళ్ళకు ఆయన డాకు. నాకు మాత్రం మహారాజ్‌’, కింగ్‌ ఆఫ్‌ జంగిల్‌.’ వంటి డైౖలాగ్స్‌, మేకింగ్‌.. ఇలా ప్రతీ అంశం ప్రేక్షకులకు థ్రిల్‌ ఇస్తుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదల కానుంది. యాక్షన్‌, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన ఈ చిత్రంతో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందిస్తామని చిత్ర బందం నమ్మకంగా ఉంది.