మీచౌంగ్ తుఫాను కారణం గా పొగాకు పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని టుబాకో బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ అన్నారు.ఈ మేరకు ఆయన గురువారం జంగారెడ్డిగూడెం పొగాకు బోర్డు పరిధిలోగల ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి,అశ్వారావుపేటతోపా టు పలు ప్రాంతాల్లో పర్యటించి తుఫాను వల్ల దెబ్బతిన్న పొగాకు తోటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంగారెడ్డిగూడెం కేంద్రం పరిధిలోనే దాదాపు 1000 ఎకరాల్లో పొగాకు తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని,వందల ఎకరాల్లో స్వల్పంగా నష్టం జరిగిందని అన్నారు. తుఫానుతో రైతులకు ఎకరానికి రూ.1లక్ష నుంచి రూ.1లక్ష 50 వేల మేర నష్టపోయారని, బాధిత రైతులంతా ధైర్యంగా ఉండాలని కోరారు.గతంలో కుడా తుఫాను,వర్షాల కారణంగా పొగాకు పంటలకు నష్టం జరిగిందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతులకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఎం ఆది శేషయ్య, సూపరింటెండెంట్ జే.సురేంద్ర, ఫీల్డ్ ఆఫీసర్లు జేసీ ప్రభాకర్ రెడ్డి, బాలాజీ, కే.వెంకయ్య,రైతు సంఘం బాద్యులు సత్రం వెంకట్రావు, గడ్డమడుగు సత్యనారాయణ రెడ్డి, రెడ్డిబాబు పాల్గొన్నారు.