నేడు మంత్రి జన్మదినం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ – సిద్దిపేట
ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు జన్మదిన సందర్భంగా 18 వ వార్డులోనీ పాత గ్రామపంచాయతీ వార్డు కార్యాలయంలో అద్వైత హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు 18వ వార్డు టిఆర్ఎస్ నాయకులు అడ్డగట్ల శేఖర్, వార్డు కౌన్సిలర్ కావేరి అంజి తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ వార్డులోని ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు వైద్య శిబిరం కొనసాగుతదని అన్నారు.