నేడు విద్యా సంస్థలకు సెలవు

– ప్రభుత్వ ప్రకటన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు సోమవారం సెలవు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జనజీవనం స్తంభించిపోయిందని పేర్కొంది. పలు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయని తెలిపింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ఈమేరకు ఆదివారం సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.