నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ పిల్లల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం 11.00 గంటలకు పిల్లల కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం ఈ మేరకు ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య ఒక ప్రకటన విడుదల చేశారు. పిల్లలు – ప్రజావాణి పేరిట హై స్కూల్, జూనియర్ కాలేజ్ స్థాయి విద్యార్థిని, విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, యూనిసెఫ్ చీఫ్ జలాలెమ్ బి తఫిసి, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, వివిధ శాఖలకు సంబంధించిన రాష్ట్రస్థాయి అధికారులు హాజరుకానున్నారు. విద్యా రంగంలో బాల, బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కావాల్సిన సౌకర్యాలు, భద్రతా వంటి అంశాలపై ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం కొనసాగనుంది.