నేడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన నిర్వహించనున్నట్లు సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ అఫీసర్ బి.ధర్మ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి. ధర్మ నాయక్ మాట్లాడుతూ.. జాతీయ రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని సీబీసీ నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస, పాటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, తదితరులు హాజరవుతారన్నారు.