న్యూఢిల్లీ : రెమెడియం లైఫ్‌కేర్ లిమిటెడ్ బోర్డు ఇటీవలే 1:5 నిష్పత్తిలో షేర్ల విభజనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. స్టాక్ స్ప్లిట్‌కు ఫిబ్రవరి 23 రికార్డ్ తేదిగా నిర్ణయించింది. రూ.10 ముఖ విలువ ఉన్న ఒక్క షేరు రూ.2 ముఖ విలువ ఉన్న ఐదు షేర్లుగా మారతాయి. దీంతో 100 షేర్లు ఉన్నవారికి 500 షేర్లు లభించనున్నాయి. పెట్టుబడి దానికి తగ్గట్లుగా అడ్జస్ట్ అవుతుంది. ఈ లెక్కన ఏడాది కిందట ఈ రెమెడియం స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడికి ఇప్పుడు దాదాపుగా రూ. 18 లక్షలు మేర వచ్చే అవకాశం ఉంది.