నేడు సుందరయ్య వర్ధంతి

– ముఖ్య అతిథిగా లోక్‌సభ రిటైర్డు సెక్రటరీ జనరల్‌ పీడీటీ చారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా 38వ స్మారకోపన్యాసాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం సాయంత్రం 6గంటలకు జరగనుంది.
ఈ సందర్భంగా ‘భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-సవాళ్లు, రాజ్యాగ విలువలు’ అంశంపై లోక్‌సభ రిటైర్డు సెక్రటరీ జనరల్‌ పీడీటీ చారి స్మారకోపన్యాసం చేయనున్నారు.
ఎస్‌వీకే ట్రస్ట్‌ చైర్మెన్‌ బీవీ రాఘవులు అధ్యక్షత వహించనున్నారు. ఎస్‌వీకే మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయ్ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.