నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న తొలివిడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఆదివారం సీట్లు కేటాయిస్తారు. 75,172 మంది అభ్యర్థులు 49,42,005 వెబ్ ఆప్షన్లను నమోదు చేశారు. ఒక అభ్యర్థి అత్యధికంగా 1,109 ఆప్షన్లను సమర్పిం చారు. రాష్ట్రంలో 155 ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,07,039 సీట్లున్నాయి. వాటిలో కన్వీనర్ కోటాలో 76,359 సీట్లు అందుబాటులో ఉన్నాయి.