నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
ఓటరు చైతన్య కార్యక్రమాలలో భాగంగా నైతిక ఓటు హక్కు పై నేడు రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్యలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ నుండి క్లాక్ టవర్ వరకు క్యాండిల్ వాక్ ను నిర్వహించనున్నట్లు పార్లమెంటు ఎన్నికల స్వీప్ నోడల్ అధికారి ప్రేమ్ కరణ్ రెడ్డి ఒక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశాల మేరకు క్యాండిల్ వాక్ ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఓటు హక్కు పై ఓటర్లలో చైతన్యం కలిగించడంతోపాటు, నైతిక ఓటు ప్రాధాన్యతను తెలియజేపి ఈనెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల పోలింగ్ లో ఓటర్లందరూ పాల్గొని ఓటు వేసేలా చైతన్యం తెచ్చేందుకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.