– మ.2.30గం||ల నుంచి
కొలంబో: టి20 సిరీస్ నెగ్గిన ఉత్సాహంలో ఉన్న టీమిండియా.. ఇక శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారతజట్టు టి20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. వన్డే సిరీస్‌కు టి20 ప్రపంచకప్ సాథించిన రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చాడు. అలాగే విరాట్ కోహ్లి కూడా జట్టుతో కలవడంతో భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారింది. మరోవైపు శ్రీలంక టి20 సిరీస్‌ను కోల్పోయినా.. స్వదేశంలో కనీసం వ్డే సిరీస్‌ను అయినా నెగ్గాలనే దృఢ సంకల్పంతో బరిలోకి దిగుతోంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్ లేకుండానే బరిలోకి దిగుతున్నారు.
జట్లు….
ఇండియా: రోహిత్(కెప్టెన్), శుభ్‌మన్, కోహ్లి, కెఎల్ రాహుల్, పంత్(వికెట్ కీపర్), దూబే, అక్షర్, కుల్దీప్, సిరాజ్, ఆర్ష్‌దీప్, ఖలీల్ అహ్మద్, సుందర్, రియాన్ పరాగ్, హర్షీత్ రాణా.
శ్రీలంక: అసలంక(కెప్టెన్), నిస్సంక, ఫెర్నాండో, కుశాల్ మెండీస్(వికెట్ కీపర్), సమరవిక్రమ, లైనగే, వెల్లెలిగే, హసరంగ, తీక్షణ, అసితా ఫెర్నాండో, షిరాజ్, కరుణరత్నే, ధనుంజయ, కమిందు మెండీస్, మధుశంక, మలింగ.