నేడు బట్టుగూడెంలో ఆయప్పస్వాముల మహాపడిపూజ..

– హాజరువుతున్న ఏంఎల్ ఏ జయవీర్
– బుసిరెడ్డి పౌండేషన్, ఆత్మబంధు ద్వారా ఆల్ఫాహారం
నవతెలంగాణ -పెద్దవూర
శ్రీ ఇష్టకామేశ్వర స్వామి ఆశీస్సులతో,శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవ ఆహ్వానము నేడు పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామం లో కూన్ రెడ్డి గోవింద రెడ్డి, శ్రీశ్రీశ్రీ రామారావు తాంత్రిక గురుస్వామి, శ్రీ మండల గోవింద్ గురుస్వామి, శ్రీ పానగంటి మల్లయ్య గురుస్వామి, శ్రీ పేరూరి గోవింద్ గురుప్వాముల ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా నిర్వహింస్తున్నామని బట్టుగూడెం ఇష్టకామేశ్వర స్వామీ ఆలయ పూజారి బుధవారం తెలిపారు. అయ్యప్ప, ఆంజనేయ స్వాములు, శివ స్వాముల భక్తులకు బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి అల్పాహారం ఉచితంగా అందిస్తూన్నారని తెలిపారు. సంగీత స్వరనిధి నేషనల్ అవార్డు గ్రహీత రాజేష్ గురుస్వామిచే గానామృతం, భజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కీర్తి శేషులు  యదుళ్ళ వెంకట్ రెడ్డి గురుస్వామి ఆశీస్సులో భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమానికి భక్తులకు సహాయ సహాకారాలు అందించిన దాతలు, భక్తులు హాజరు కావాలని తెలిపారు.