నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం గురువారం సాయంత్రం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. శాసనసభ, శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగాలు ముగిసిన వెంటనే బయలుదేరనున్నారు. మొదట కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ)ను పరిశీలిస్తారు. రామగుండంలో రాత్రికి బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంపు హౌజ్, ఆ తర్వాత 11 గంటలకు మేడిగడ్డ రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. రాత్రి 7.24 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు.