‘వ్యవసాయ పరిశోధన స్థానంలో నేడే విత్తనమేళా’

నవతెలంగాణ-తాండూరు
తండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నేడు విత్తనమేళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పరిశోధన కేం ద్రం ప్రధాన శాస్త్రవేత్త సుధారాణి మంగళవారం ఒక ప్రక టనలో తెలిపారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, రాష్ట్ర వ్యవ సాయ విశ్వవిద్యాలయం రైతులకు నాణ్యమైన విత్తనం అం దించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మే 24న విశ్వ విద్యాలయం రాజేంద్రనగర్‌ కేంద్రంగా పెద్ద ఎత్తున విత్తన మేళాను నిర్వహిస్తోందన్నారు. ఈ సందర్భంగా తాండూ రులోని వ్యవసాయ పరిశోధన స్థానంలో నేడు విత్తనమేళా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ మేళాలో వ్యవసాయ పరి శోధన స్థానం తాండూరు రూపొందించిన వివిధ కంది రకాలను అనగా తెలంగాణ కంది-3(టిడిఆ ర్‌జీ-59), ఆశ(ఐసిపిఎల్‌ 87119)రకాల విత్తనాలను రైతులకు అందు బాటులో ఉంచుతామన్నారు. దీంతో పాటు రైతులకు నూత న వంగడాల లక్షణాలు వాటి గుణ గణాల పైన అవగాహన కలిగించడానికి శాస్త్రవేత్తలతో చర్చా వేదికను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ వ్యవసాయ పరిశోధన స్థానంలో లభ్యమయ్యే కంది రకాలు నాలుగు కిలోల ప్యాకింగ్‌తో అందుబాటులో ఉన్నాయన్నారు. ఒక్క ప్యాక్‌ ధర రూ. 520 కం ది విత్తనాలు కావాల్సిన రైతులు తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించే కా ర్యక్రమంలో పాల్గొని ఇతర పం టల విత్తనాలు వ రి, మొక్క జొన్న, తీపి మొక్కజొన్న, ఆముదం, పెసర, మిను ము, ఖరీఫ్‌ జొ న్న, పచ్చజొన్న, పశుగ్రాస పంట విత్తనాలు, జీవన ఎరు వులు, పరాన్న సూక్ష్మ జీవులు మొదలైనవి పొందడానికి రా జేంద్రనగర్‌లో జరుగుతున్న ప్రధాన విత్తన మేళాను సం దర్శిం చవలసిందిగా తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సి.సుధారాణి కోరారు.