నవతెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ కవి, రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ పుర స్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి రచించిన కవితా సంపుటి శనివారం ఉదయం 9 గంటలకు మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించనున్నారు. మంచిరేవుల క్రాస్ రోడ్స్ లోని తారకమ్మ ప్రాంగణం, ఎ26 డ్యూవిల్లే లో జరిగే ఈ ఆవిష్కరణ సభకు ఉస్మానియా తెలుగుశాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎస్.ర ఘు అధ్యక్షత వహిస్తారు. తొలి సంపుటిని కవి కథకులు కటకోజ్వల ఆనందాచారి స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా కాసుల ప్రతాపరెడ్డి, కె.పి. అశోక్ కుమార్, ఒద్దిరాజు ప్రవీణ్ కూమార్, మధుకర్ వైద్యుల, విశిష్ఠ అతిథులుగా ఎం.వి రాఘవరెడ్డి, నాగవరం బలరాం, వనపట్ల సుబ్బయ్య, అనంతోజు మోహన్ కృష్ణ తదితరులు పాల్గొంటారు.