
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నాయినవాణి కుంట గ్రామం లో ఆల్విన్ పౌండేషన్ వారి ఆధ్వర్యంలో నల్గొండ సంకల్ప హాస్పిటల్ వైద్య సిబ్బంది చే మెగా ఉచిత వైద్య శిభిరం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, జిల్లా కాంగ్రెస్ యువ నాయకులు వాసికర్ల వినయ్ రెడ్డి, వాసికర్ల విక్రమ్ రెడ్డి శనివారం విలేకరుల తో తెలిపారు. ఈసందర్బంగా మాట్లాడుతూ వైద్య శిభిరం ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ సంకల్పహాస్పిటల్ వైద్య సిబ్బంది అయిన డాక్టర్ కరీముల్ల జనరల్ ఫిజీషియన్, డాక్టర్ కిషన్ ఆర్థోఫిడిక్, రఘుతేజ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ చంద్రమౌళి చెవి, ముక్కు, గొంతు, వారిచే వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని నాయినవాణికుంట తండా గ్రామ పంచాయతీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వైద్య శిభీరాన్ని మాజీ జెడ్ పి వైస్ ఛైర్మెన్ కర్నాటీ లింగారెడ్డి, మాజీ ఎడమ కాలువ ఛైర్మెన్ మలిగిరెడ్డి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ ఆదివాసి రాష్ట్ర ఉపాధ్యక్షలు రమావత్ శంకర్ నాయక్ లు ప్రార్శంభిస్తునట్లు తెలిపారు.