– పెద్ద సంఖ్య లో నామినేషన్ కు వెళ్ళనున్న కార్యకర్తలు
– జనాలను సమీకరించడంలో బిజీ బిజీ
– సాగర్లో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నం
– ఈసారి కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్న పెద్దాయన జనారెడ్డి
నవతెలంగాణ -పెద్దవూర: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికకు నేడు రెండు ప్రదాన పార్టీలు నామినేషన్లు దాకలు చేయనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జయవీర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కుమార్ గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ సందర్భంగా మాజీమంత్రి కుందూరు జానారెడ్డి, జెడ్ పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్రశేఖర్ రెడ్డి, కుందూరు రఘు వీర్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రానున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ నామినేష్ కు రాష్ట్ర నాయకులు సాధం సంపత్ కుమార్, ఆయా మండలాల జెడ్పిటిసీ లు, ఎంపీపీలు, ఎంపిటిసిలు, సర్పంచులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించడంలో ఇరు పార్టీల నాయకులు బిజీ బిజీ గా ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే గ్రామాల్లో సభలు సమావేశలు నిర్వహిస్తు ఏ గ్రామం నుంచి ఎంత మంది వస్తున్నారు వంటి లెక్కలను సమీకరిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయితే ప్రచారం హోరు పెరుగనున్నది.కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ వర్గాలు సమిష్టిగా పనిచేయాలని పెద్దాయన ఆదేశించారు. అభ్యర్థి అవకాశాలను బలోపేతం చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులు బూత్ స్థాయిలో కృషి చెయాలని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తాయని, కాంగ్రెస్ అభ్యర్థి అధిక ఓట్లతో విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు భవిస్తున్నాయి. అందులో భాగంగా నామినేషన్ రోజున పెద్ద సంఖ్యలో చేరుకోవాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థికూడ భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరుసగా 2018,2021ఎన్నికలో బీఆర్ఎస్ వరుస విజయాలు సాధించింది.2023 లో కూడా సాగర్ లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నస్తుంది. అదిశగా అడుగుల వేస్తూ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.