నేడు యాదాద్రి కి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ 

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ రాణి కుమిదిని రేపు 21వ తేదీ శనివారం నాడు యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకుంటారని జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండగే శుక్రవారం  ప్రకటనలో తెలిపారు. ఈనెల 21వ తేదీన అనగా  శనివారం  ఉదయం 6.00 గంటలకు వారు హైదరాబాద్ నుండి బయలుదేరి 7:45 గంటలకు యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకుంటారని, స్వామి వారి సేవలో పాల్గొన్న అనంతరం ఉదయం 11.00 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళతారని తెలిపారు.