
బాలల దినోత్సవం పురస్కరించుకొని గురువారం మండలం లోని పోతునూరు ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా భారతమొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా మిర్యాలగూడ వాస్తవ్యులు పెయింటర్ అమిర్ అలీ సహకారంతో రూ.3000 ఖరీదు చేసే నోటుపుస్తకాలను ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్ నాయక్ చేతులమీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. నెహ్రూ జన్మదిన సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకట్రామ్ నాయక్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టి విద్యా వైద్యము పరిశ్రమ వ్యవసాయ రంగాలను బలోపేతం చేసిన గొప్ప మహానుభావుడు పండిత్ జవహర్లాల్ నెహృ అని విద్యార్థులకు తెలిపారు.నెహ్రూ గారి ఆశయ సాధన కోసం అందరం గొప్పగా ఎదగాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యకర్తలు, ఏఎన్ఏం లు, లావణ్య అంజుమ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.