– నవతెలంగాణ బుకహేౌస్ మేనేజర్ వాసు
– చిల్డ్రన్స్ డే సందర్భంగా పుస్తక ప్రదర్శనశాల ప్రారంభం
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నేటి పిల్లలే రేపటీ పౌరుల ని నవతెలంగాణ పబ్లిషింగ్ బుకహేౌజ్ జీఎం వాసు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జవహార్‌లాల్ నెహూ జయంతి సందర్బంగా నవతెలంగాణ పబ్లిషింగ్ బుకహేౌజ్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనను ప్రారంబించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేటి పిల్లలే రేపటి నవభారత నిర్మాతలు అని, వారి బంగారు భవిష్యత్ కోసం పుస్తకాల అవసరమన్నారు. పుస్తక ప్రదర్శనలో బాల సాహిత్యం, ఖగోళ చరిత్ర, మహనీయుల సందేశాలు, తదితర అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని అన్ని సామాజిక తరగతులు ఉపయోగించు కోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేకంగా ఈ దేశ సమకాలిన మార్పు కోసం పుస్తకాల అధ్యయనం ఎంతో అవసరమని తెలిపారు. దేశంలో వస్తున్న మార్పులు, సామాజిక అసమానతలు, తెలంగాణ సాయుధ పోరాటం, రష్యా విప్లవం, మాక్సీం గోర్కి, దేశ సంస్కృతి వంటి అనేక విషయాలు పుస్తక పఠనం ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఒక చినిగిన చొక్కానైనా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న మహానీయని మాటలు గమనంలో ఉంచుకొని పుస్తకాదరణ పెంచుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో నవతెలంగాణ మహబూబ్ నగర్ రీజనల్ మేనేజర్ ఎం కార్తీక్, డెస్క్ ఇన్‌చార్జి భాస్కర్, డివిజన్ ఇన్‌చార్జి ప్రవీణ్, బాబు, తదితరులు పాల్గొన్నారు.