– పాఠశాలలో మరుగుదొడ్ల శుభ్రతకు ప్రత్యేక మిషన్ క్లినిక్ కార్యక్రమం
– చేవేళ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ-తాండూరు
నేటి బాలలే రేపటి పౌరులలని చేవేళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయ న పాల్గొని మాట్లాడారు.. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిం చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం తనను ఆకర్షించిందన్నారు. పాఠశాల విద్యార్థులకు శుభ్రమైన మరుగుదొడ్లు అందించాలని ఉద్దేశంతోనే మరుగుదొడ్ల క్లినిక్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఒక ట్రక్కు నుంచి 30 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. గతంలో పాఠశాలల్లో మరుగు దొడ్లను శుభ్రం చేసే వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు పనిచేసే వాళ్లను తొలగించాయని విమర్శించారు. ప్రస్తుతం 7 ట్రక్కులతో 110 గ్రామా ల్లోని స్కూల్లలో స్వచ్ఛత కార్య క్రమం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. శని వారం తాండూరు పట్టణంలో 8వ ట్రక్కును ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ స భ్యులు యు.రమేష్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణముదిరాజ్, బీజే పీ మహిళ మోర్చ నాయకులు అంతారం లలిత, సాహు శ్రీలత, బీజేపీ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా కార్యద్శి బంటారం భద్రేశ్వర్, నాయకులు గాజుల శాంతుకుమార్, శేఖాపురం ఆంజనేయులు, దోమ కృష్ణ, బీసీ సెల్ జిల్లా నాయకులు బొప్పి శ్రీహరి, అంతారం కిరణ్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.