నేటి బాలల చదువు, రేపటి భవితకు వెలుగు

– మంచాల జడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్‌ రెడ్డి
– మండల కేంద్రంలో అక్షరాభ్యాసం కార్యక్రమం
నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్‌
కష్టపడి చదువుకుంటేనే పిల్లల జీవితాల్లో వెలుగులు నిండుతాయని మర్రి నిత్య నిరంజన్‌ రెడ్డి అన్నారు.శుక్రవా రం మండల కేంద్రంలో బడిబాట కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జయశంకర్‌ బడి బాట కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ పిల్లలకు 1వ తరగతి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. వారు మా ట్లాడుతూ..ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేసే కార్యక్రమంలోనే పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు అందిం చామన్నారు. విద్యారంగ అభివద్ధికి ప్రభుత్వం చేస్తున్న కషిలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరారు. వి ద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ శక్తి సామర్థ్యాల ను, సజనా త్మకతను వెలికి తీయడానికి నాయకత్వ లక్షణాలు అల వరుచుకోవాలని ఇలాంటి బాలసభలు ఉపయోగపడుతా యన్నారు. తమ దష్టికి వచ్చిన స్కావెంజర్‌, డ్రింకింగ్‌ వాటర్‌, రన్నింగ్‌ వాటర్‌ వంటి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. త్వరలోనే వాటర్‌ ఫిల్టర్‌, స్పోర్డ్స్‌ డ్రెస్సులు అందిస్తామని మాట ఇచ్చారు. తన సొంత డబ్బులతో ప్రైమరీ స్కూల్‌కు వంట పాత్రలు అందజేశారని తెలిపా రు. కార్యక్రమంలో నోడల్‌ ఆఫీసర్‌ రాం దాస్‌,స్పెషల్‌ ఆఫీసర్‌ తేజ్‌ సింగ్‌, మాజీ సర్పంచ్‌ అనిరెడ్డి జగన్‌ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాజ్‌ కుమార్‌, ప్రధానోపాధ్యా యు లు నారాయణ రెడ్డి, ఝాన్సి, సుగంధ, మాజీ కో ఆప్షన్‌ సభ్యులు బాల్‌రాజ్‌, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్‌ లు, ఆశావర్కర్లు, చిన్నారులు, విద్యార్థులు పాల్గొన్నారు.