నాడు నెరవేర్చక… నేడు నాటకం


నవతెలంగాణ భీంగల్:
బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా నేడు రాజకీయ లబ్ధి పొందేందుకు ధర్నాల పేరుతో కపట నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జె జె నరసయ్య అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పదేండ్ల సంక్షేమ ఫలాలను ప్రజలకు అందకుండా నాయకులు కార్యకర్తలు నొక్కేశారని ఇది గమనించిన ప్రజలు ఎన్నికలలో తగు గుణపాఠం నేర్పారని అన్నారు. ఇది జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేనిపోని ధర్నాలు నిర్వహించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో గృహలక్ష్మి పేరుతో నామమాత్రపు ప్రోసిడింగ్ కాపీలను ఇచ్చి చేతులు దులుపుకున్నారని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఇయ్యదని చెప్పి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఇది లబ్ధిదారులు నమ్మవద్దని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి లబ్ధిదారునికి ఆరు గ్యారెంటీ సంక్షేమ పలాలు అందుతాయని నరసయ్య తెలిపారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి ,గోపాల్ నాయక్, కరాడి రాజు, సుంకరి సురేష్, అనంతరావు, శివరాం నాయక్, నాగేంద్ర తో పాటు మండల నాయకులు పాల్గొన్నారు