నవతెలంగాణ-హిమాయత్‌నగర్
నేటి తరం పిల్లలు పాశ్చ్యాత్య సాంస్కతికి అలవాటు పడి భారతీయ ప్రాచీన కళ లను విస్మరిస్తున్నారని, వారికి కళలను తెలియజేయాల్సిన బాధ్యత ప్రతీ తల్లిదండ్రులపై ఉందని శ్రీ క్లాసికల్ డాన్స్ ఇనిస్టిట్యూట్ ఫౌండర్ డైరెక్టర్, నిర్వాహకులు నిర్మలా రాణి, లక్ష్మిలు అన్నారు.ఇనిస్టిట్యూట్ 10వ వార్షికోత్సవ వేడుకలను శివోహం పేరిట నగరంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ గత పదేళ్లుగా ఎంతో మంది విద్యార్థులకు కూచి పూడి నత్యంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.ఐదేళ్ల వయస్సు నుండి 40 ఏళ్ల వయస్సు వరకు తమ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ ఇస్తున్నట్లు , ఈ వేడు కలలో 40 మంది విద్యార్థులు మహా గణపతిమ్, కామాక్షి స్తుతి, తాండవ నత్యం, చిదంబరేశ్వర స్తోత్రం, శివాష్టకం తదితర విభాగాలపై ప్రదర్శించిన నత్యాలు ఆహు తులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమానికి సంగీత నాటక అకాడమీ అవార్డ్ గ్రహీత వేదాంత రాధేశ్యామ్ హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.