కులాల కుళ్ళుతో మతాల మత్తుతో
భావోద్వేగాల ఊబిలో
పడి ఉన్మాదులై
మనిషినని మరిచి
మానవత్వం కాళ్ళదన్ని
మణిపూర్ మహాభారతంలో
మహిళలను వివస్త్రలను చేసి
హత్యలు, అత్యాచారాలు చేసే
కలియుగ కౌరవుల కండకావరాన్ని
కడిగేయగా ఖండించగా
మన భారతమాతలను రక్షించుకోవటానికి
తూటాలకు తూటతోనే బదులిచ్చే
పూలన్ దేవిలై కదలాలి…
– అక్షర జ్వాల, 9010483021