ఒకే పాత్రతో నేటి భారతం

Today's India with a single characterఒకే పాత్రతో, సామాజిక సందేశంతో రూపొందిన చిత్రం ‘నేటి భారతం’. భరత్‌ పారేపల్లి దర్శకత్వంలో డా.యర్రా శ్రీధర్‌ రాజు నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ని లాంచ్‌ చేశారు.ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సాంబేష్‌ మాట్లాడుతూ, ”మేరా భారత్‌ మహాన్‌’ సినిమా తర్వాత ప్రస్తుతం ఒకే పాత్రతో శ్రీధర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఈ చిత్రం ద్వారా చూపించారు’ అని అన్నారు. ‘కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక, సామాజిక స్థితి గతులపై ఈ చిత్రం ఉంటుంది. ముఖ్యంగా పాలసీ మేకింగ్‌తో పాటు ఆ పాలసీల వెనకాల రాజకీయ నాయకులు స్వార్థాలు, వాటి అమలు తీరు ఇలా పలు సామాజిక అంశాలపై పై మా చిత్రం చేశాం. పెద్దాడమూర్తి ఈ చిత్రానికి అద్భుతమైన మాటలు, పాటలు అందించారు. ఇందులో నేను జర్నలిస్ట్‌ పాత్రలో నటించాను. దీనికి తెరవెనుక హీరో దర్శకుడు భరత్‌ పారేపల్లి. ఈ చిత్రంలో ఏపీ రాజధాని అంశంతోపాటు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లాంటి సున్నితమైన అంశాల గురించి కూడా చర్చించాం’ అని నటుడు, నిర్మాత డా. యర్రా శ్రీధర్‌ రాజు చెప్పారు. దర్శకుడు భరత్‌ పారేపల్లి మాట్లాడుతూ,’ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. శ్రీధర్‌ రాజు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా’ అని అన్నారు.