నేడు వెంకట్రావుపేటలో మాఘ అమావాస్య జాతర..

Magha Amavasya fair in Venkatravupeta today..నవతెలంగాణ – తొగుట

మండలంలోని వెంకట్రావ్ పేట గ్రామ శివారులో కూడవెళ్లి వాగుకు ఒడ్డున.. పచ్చని పంట పొలాల చెంత.. గుట్టల మధ్య వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం నాడు జరిగే జాతరాకు ముస్తాబైంది. మూడు వైపుల గుట్ట గుండ్లుండ టం… ఈశాన్యం వైపు ద్వారం మాదిరిగా ఖాలీగా ఉండటం.. ద్వారం ముందు వైపే ఈశాన్యం నుండి కూడవెళ్లి వాగు ప్రవహించటం వాస్తు రిత్యా ప్రాధా న్యతను సంతరించుకుంది. ప్రతి ఏటా మాఘమా మవాస్య సందర్భంగా ఇక్కడ జాతర నిర్వహించ డం ఆనవాయితీగా వస్తుంది. కోరిన కోర్కెలు తీర్చే ప్రజల ఆరాధ్య దైవంగా భావించే కలియుగ భగ వానుడు వెంకటేశ్వర స్వామిని గ్రామం లోని వేణు గోపాల స్వామి దేవాయలం నుండి షావ ద్వారా ఊరేగింపు గా ఇక్కడికి తీసుకువోస్తారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. ఆలయం ప్రక్క నే ఉన్న యోగేశ్వరా లయం చుట్టూ మామిడి, కొబ్బరి ఆకులతో అలంకరించిన ఎడ్ల బండ్ల ఊరే గింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వ హిస్తారు. మాఘమా మవాస్య సందర్భంగా భక్తులు కూడ వెళ్లి వాగులో స్నానం చేసి దేవున్ని దర్శించు కుంటే పాపాలు, కష్టాలు తొలగిపోయి మంచి జరు గుతుంద నేది భక్తుల విశ్వాసం. జాతరకు తొగుట మండలంలోని అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నారు.