ఈనెల 2 న సోమవారం న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల వలన రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ కార్యాలయానికి సోమవారం నాడు రావద్దని ఆ ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు.