నేటి పాలకులు దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్నారు 

Today's rulers are looting the nation's wealth to corporate companies– ప్రజా సంఘాల నాయకుల వెల్లడి
నవతెలంగాణ – కంఠేశ్వర్
దేశంలోని  సహజ వనరులను,  ప్రజాసంపదను స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారు దోచుకెళ్తే దాన్ని కాపాడుకోవడానికి స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు త్యాగం చేసి పోరాడి సాధించుకున్న స్వతంత్ర దేశంలో నేటి పాలకులు కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు సంపదను దోచిపెడుతున్నారని విధానాలను నిరసిస్తూ  కేంద్ర కార్మిక సంఘాలు, రైతు కూలి సంఘాలు బుధవారం రాత్రి భగత్ సింగ్ విగ్రహం వద్ద క్యాండిల్ ప్రదర్శన నిర్వహించి    గో బ్యాక్ బిజెపి, క్విట్ ఇండియా కార్పొరేట్  అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు ఎస్కేయం నాయకులు ప్రభాకర్  , ఏఐటీయూసీ నాయకులు సుధాకర్ ఐఎఫ్టియు నాయకులు భూమయ్య మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలతో సామ్రాజ్యవాదం బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న స్వాతంత్ర దేశంలో ఫలాలను ప్రజలకు అందకుండా ప్రజా సంపదను, సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను, అన్నింటిని కొద్దిమంది కార్పొరేట్ కంపెనీలకు దారా దత్తం చేస్తూ, ప్రజల పైన విపరీతమైన భారాలను మోపటమే కాకుండా ఉపాధి అవకాశాలను తగ్గించి ప్రజలను మరింత దారిద్రంలోకి పేదరికంలోకి నెట్టివేస్తున్నారని కార్పొరేట్ కంపెనీలకు లాభాలు పెంచే విధంగా పారిశ్రామిక రంగంలో కార్మిక చట్టాలను మార్చడంతో పాటు, వ్యవసాయ రంగంలో రైతుల గిట్టుబాటు ధర లేకుండా కార్పొరేట్ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించటం తో పాటు విద్య వైద్యం అందించటానికి ప్రభుత్వం నిధులను కేటాయించకుండా కార్పొరేట్ పరం చేయటం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల సమస్యలు పరిష్కారం చేయటంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని వాటి నుండి ప్రజల దృష్టిని మరల్చడం కోసం జాతీయతా భావం పేరుతో ప్రజల్లో విద్వేషాలను పెంచి  తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకుంటున్నారని అందువల్ల ప్రజలందరూ వ్యతిరేకంగా కార్పొరేట్ దోపిడిని   నిలువరించటానికి  స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో క్విట్ ఇండియా నినాదం ఆదర్శంగా క్విట్ బిజెపి  క్విట్ కార్పోరేట్ అనే నినాదంతో ముందుకు పోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోసాయి కార్మిక సంఘం నాయకులు పెద్ది వెంకట్ రాములు,  గంగారాం, సంగం నాయకులు వెంకటేష్, సాయి రెడ్డి, గంగాధర్, కార్మిక సంఘం నాయకులు రాములు, నర్సింగ్ రావు, శివకుమార్ మరియు ఐద్వా నాయకులు సుజాత, ప్రజానాట్యమండలి నాయకులు సిర్ప లింగం, విద్యార్థి సంఘం నాయకులు విగ్నేష్ తదితరులతో పాటు సిఐటియు, ఏఐటీయూసీ, ఐ ఎఫ్ టి యు, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.