నేటి యువతే భవిష్యత్తు సమాజం..

– సత్సమాజం నిర్మాణమే ప్రభుత్వం లక్ష్యం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
సత్సమాజాన్ని రూపొందించడం మే ప్రభుత్వం లక్ష్యం అని అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ఆద్వర్యంలో ఏర్పడిన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం పోలీస్ శాఖ ఆద్వర్యంలో సీఐ జితేందర్ రెడ్డి పర్యవేక్షణలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో నిర్వహించి ర్యాలీ కి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్ధి,యువత ను ఉద్దేశించి మాట్లాడారు. నేటి యువతే భవిష్యత్తు సమాజం అయినందున ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు బానిసగా మారుతున్నారని,అటువంటి యువతను సన్మార్గంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. ముందుగా గంజాయి,మద్యం, మత్తు పదార్థాల వాడకం,అక్రమ రవాణా నిషేధం పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులకు అవగాహన కల్పించారు.పోలీస్ వారికి ప్రజలు సహకరించి ఇటువంటి డ్రగ్స్ అక్రమ రవాణాపై ఎటువంటి సమాచారం ఉన్నా అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్,నాయకులు జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు, ప్రమోద్ తో పాటు విద్యార్థులు,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.