
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
భగత్ సింగ్ ఆశయాలు నేటి యువతకు ప్రతి ఒక్కరీ గుండెను తట్టిలేపేలా యువజన పోరాట నాయకులు యువ విద్యార్థులు కార్యాచరణ తో ముందుకు సాగాలని ఏఐవైఏఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ పిలునిచ్చారు. బుధవారం సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురూ సుఖ్ దేవ్ ల 93 వ వర్ధంతి ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా యువజన క్రీడొత్సవాలు సదస్సులు సాంస్కృతిక కార్యక్రమాలను జయప్రదం చేయాలని యువజన సంఘం పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భగత్ సింగ్ రాజ్ గురూ సుఖ్ దేవ్ ల ఆశయాలను కొనసాగిస్తూ వర్ధంతి కార్యక్రమాలను సిద్దిపేట జిల్లా వ్యాపితంగా ప్రతీ మండల కేంద్రాల్లో నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమం లో ఏ ఐ వై ఎఫ్ మాజీ నాయకులు యెడల వనేష్,, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్,, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు హుస్నాబాద్ మండల అధ్యక్షురాలు తొంధురి రేవతి, అక్కన్నపేట మండల కార్యదర్శి బిచ్చాల శ్రీనివాస్, దొంతరబోయిన రజిత, తగురం స్వామి, రాయకుంట సంపత్ తదితరులు పాల్గొన్నారు.