అందరం కలిసి కుంభంను గెలిపించుకుంటాం

– డీసీసీ సమీక్షాసమావేశంలో నాయకుల వెల్లడి
నవతెలంగాణ- భువనగిరిరూరల్‌
భువనగిరి కాంగ్రెస్‌ అభ్యర్థి కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి ని అందరం కలిసి గెలిపించుకుంటామని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. కుంభం గెలుపుకోసం డీసీసీ అధ్యక్షులు అండెమ్‌ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఆ పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థించిన కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి గెలుపునకు కషి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ప్రజలలోకి తీసుకెళ్లి అనిల్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని, ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్‌ సెక్రెటరీ పోత్నక్‌ ప్రమోద్‌ కుమార్‌, మున్సిపల్‌ మాజీ చైర్మెన్‌ బర్రె జహంగీర్‌, టీపీసీసీ డెలిగేట్‌ తంగేళ్లపల్లి రవికుమార్‌, టీపీసీసీసెక్రెటరీ కసుబా శ్రీనివాస్‌, సింగిల్‌ విండో చైర్మెన్‌మందడి లక్ష్మీ నరసింహ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కష్ణారెడ్డి, వార్డు కౌన్సిలర్లు పగడీల రేణుక ప్రదీప్‌, ఈరపాక నరసింహ, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు దర్గాయి హరిప్రసాద్‌, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు గోద రాహుల్‌ గౌడ్‌, ఎన్‌ ఎస్‌ యు ఐ జిల్లా అధ్యక్షుడు మంగ ప్రవీణ్‌, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్ట గిరీష్‌ కుమార్‌ గౌడ్‌ లు పాల్గొన్నారు.