తొగుట గ్యారంటీ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

– పిఏసీఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి
నవతెలంగాణ-తొగుట : గ్యారంటీ పథకాలు సద్వినియోగం చేసుకునేందు కు ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని పిఏసీఎస్ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని గుడికందుల గ్రామంలో సర్పంచ్ గంగని గళ్ళ మల్లయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 5 గ్యారంటీ పథకాల కోసం ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవా లని కోరారు.గ్రామంలో అందుబా టులో లేని వారు దరఖాస్తు చేసుకునేందుకు 6 వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీడీవో శ్రీధర్,ఎంపీఓ చందన,ఏపీఎం మగ్దుం అలీ,విద్యుత్ ఏఈ శ్రీనివాస్,ఏఓ మోహన్, అంగన్వాడీ టీచర్లు,ఆశా కార్యకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.