కామారెడ్డిలో మూడు కోట్లుకు టోకారా వేసి ఐపి పెట్టిన సూపర్ మార్కెట్ యాజమాని

– లబోదిపోమంటున్న హోల్సేల్, అప్పులిచ్చిన బాధితులు 
– రెండు నెలలుగా తాళం వేసి ఉన్న సూపర్ మార్కెట్ 
– ప్రభుత్వం చర్యలు తీసుకొని సహాయం చేయాలంటూ బాధితులు 
– ఆలస్యంగా వెలుగులోకి 
నవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఏరియాలో గల మెగా మార్ట్ సూపర్ మార్కెట్, డిపార్ట్మెంటల్ స్టోర్ యజమాని మహమ్మద్ అబ్దుల్ హబీబ్ సుమారు వివిధ రూపాలలో మూడు కోట్ల వరకు కామారెడ్డి వాసులకు బాకీ పెట్టి కామారెడ్డి నుంచి పరారైనట్లు బాధితులు పేర్కొంటున్నారు. ఈ హాబీబ్ అనే వ్యక్తి ఇతర ప్రాంతం నుంచి ఇక్కడికి వ్యాపార నిమిత్తం వచ్చి గతంలో ఇతర సూపర్ మార్కెట్లో విధులు నిర్వహించిన హబీబ్ గత రెండు మూడు సంవత్సరాల క్రితం సొంతంగా మెగా మార్ట్ సూపర్ మార్కెట్ను నెలకొల్పి కొనసాగించాడు. దీంతో హోల్సేల్ వ్యాపారులు అతనికి బియ్యం నుండి మొదలుకొని టుత్ బ్రష్ లు వరకు లక్షల్లో ఉద్దెర  వేస్తూ వెళ్లారు. వీరితోపాటు మరికొందరు ఇతర దుకాణంలో ఇతను పనిచేస్తున్న సమయంలో పరిచయమైన వ్యక్తులు వారి స్నేహితులు ఇతనికి రెండు రూపాయల మిత్తి అనుకొని 50 వేల నుండి, లక్ష రూపాయల వరకు అప్పులిచ్చి నిన్నెలా ఇంట్రెస్ట్ ఇచ్చేటట్లు ఒప్పంద పత్రం రాసుకొని నెలల మీత్తి తీసుకుంటూ వెళ్లారు. గత రెండు నెలల క్రితం సూపర్ మార్కెట్ కు తాళం వేసి ఉండడంతో ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు, అని చూసి విసిగిపోయిన వీరు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కానీ వీరికి తెలిఅతనరాలేదు అతను ఐపీ పెట్టి కామారెడ్డి పట్టణం నుండి పారిపోయాడని. శనివారం వస్తాడని మెగా మార్ట్ ముందు కామారెడ్డి పట్టణంలోని పలువురు మిత్తిలకి ఇచ్చిన వ్యక్తులు, హోల్ సేల్ దుకాణాల యజమానులు మెగా మార్ట్ సూపర్ మార్కెట్ వద్ద గుమి కూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది అప్పటివరకు హోల్సేల్ యజమానులు కానీ మిథిలకు ఇచ్చిన వారు కానీ ఏ విషయాన్ని ఎవరికీ తెలుపలేదు. ప్రభుత్వం కలగజేసుకొని ఆ వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి వద్ద నుండి తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.
ప్రభుత్వం అనుకుంటే మీరీ డబ్బులు వీరికి వచ్చే అవకాశం..
హోల్సేల్ వ్యాపారులను, కొందరు అమాయకులను మోసం చేసిన ఈ వ్యక్తిని పట్టుకొని వీరికి డబ్బులు ఇప్పించాలని ప్రభుత్వ అధికారులు అనుకుంటే వారి డబ్బులు వారికి వచ్చే అవకాశం ఉంటుందని కామారెడ్డి పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. అతను ఎక్కడ ఉన్నది ఎలా ఉన్నది ప్రభుత్వ అధికారులకు ఆన్లైన్ ద్వారా తెలుస్తుందని, ప్రభుత్వ అధికారులకు కష్టమైన, ఇబ్బందులు ఎదురైన వాటిని పట్టించుకోక  తమను ఆదుకోవాలని  కోరుతున్నారు.