– కొయ్యుర్ కొనుగోలు కేంద్రాన్నీ సందర్శించిన పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వరిదాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం మ్యాచర్ వచ్చిన వెంటనే వ్యవసాయ అధికారులు టికెన్ ఇస్తారని, కాంట నిర్వహించిన వెంటనే నిర్వాహకులు ధాన్యం విక్రయించిన రైతుకు రశీదు ఇవ్వడం జరుగుతుందని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య అన్నారు.శుక్రవారం మండలంలోని కొయ్యుర్ కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్షించారు.కేంద్రంలో మ్యాచర్ వచ్చిన ధాన్యం లేదని,మ్యాచర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లుగా తెలిపారు.రైతులు అపోహలు నమ్మొద్దని తెలిపారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలల్లో విక్రయించి మద్దతు ధర రైతులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ వరి ధాన్యానికి రూ.2,320 ఇస్తుందని,అదేవిధంగా, సాధారణ రకానికి రూ.2,300 ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, క్వింటా సన్న ధాన్యానికి అదనంగా మరో రూ.500 బోనస్ కూడా ఇస్తున్నట్లుగా తెలిపారు