అషు సిల్క్స్‌ ఎంపోరియం గ్రాండ్‌ను ప్రారంభించిన టాలీవుడ్‌ నటి దక్షా నాగర్కర్‌…..

– సంప్రదాయం, సౌందర్యానికి వేదికైన కొత్తపేట అషు సిల్క్స్‌ ప్రారంభోత్సవ వేడుక…
నవతెలంగాణ హైదరాబాద్: నగరంలోని కొత్తపేట వేదికగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అషు సిల్క్స్‌ ఎంపోరియం’ను ప్రముఖ సినీతార దక్ష నాగర్కర్‌ (రావణాసురుడు, బంగార్రాజు, జాంబీ రెడ్డి సినిమాల ఫేమ్‌) ప్రారంభించారు. శనివారం ప్రారంభమైన ఈ ఎంపోరియం/స్టోర్‌  నగరంలోని ఫ్యాషన్‌ ప్రేమికులకు, సాంప్రదాయ వస్త్రా కుటుంబాల సమూహనికి అత్యద్భుత వేదికగా నిలిచింది.
        కొత్తపేట నడిబొడ్డున కొలువైన అషు సిల్క్స్‌ ఎంపోరియం భారతీయ వస్త్ర వైభవంతో పాటు అధునాతన ఫ్యాషన్ల వారసత్వాన్ని ప్రదర్శించడానికి నూతన ప్రమాణాలను నెలకొల్పింది. ఈ స్టోర్‌ సంప్రదాయ సౌందర్యాలతో సమకాలీన సోయగాల ఆకర్షణీయమైన సమ్మేళనాన్ని అందిస్తుంది. సరికొత్త హంగుల ఫ్యాషన్‌ను కోరుకునే  ఔత్సాహికులకు అనువైన చీరలు ఇతర ఉపకరణాల ప్రత్యేకంగా సేకరించి పొందుపరుస్తుంది.
       ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి దక్షా నగార్కర్‌  మాట్లాడుతూ., సమ్మోహన పరిచే భారతీయ వస్త్ర కళ, హస్తకళలకు నిలయమైన అషు సిల్క్స్‌ ఎంపోరియం ప్రారంభోత్సవంలో భాగమవ్వడం థ్రిల్లింగ్‌గా ఉందని తెలిపారు. ఇందులోని కలెక్షన్‌ సంప్రదాయ–ఆధునికతల సోయగాల కలయికతో నేటి తరం ఫ్యాషన్‌ ప్రియుల వైవిధ్యమైన అభిరుచులకు అనుగుణంగా ఉన్నాయన్నారు. ఈ స్టోర్‌ భారతీయ సాంప్రదాయ ఫ్యాష¯Œ ని ఇష్టపడే వారికి ఒక గమ్యస్థానంగా మారుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
     అషు సిల్క్స్‌ ఎంపోరియం ప్రొప్రైటర్‌ ఉమా దేవి మాట్లాడుతూ., సౌందర్యం, అభినయంతో ఆకట్టుకుంటూ సరికొత్త సినిమాలతో దూసుకుపోతున్న దక్షా నాగర్కర్‌ తమ నూతన స్టోర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.  అషు సిల్క్స బ్రాండ్‌ స్వచ్ఛమైన పట్టు చీరలు, కంచి పట్టు చీరలు, పెళ్లి చీరలు, లైట్‌ వెయిట్‌ పట్టు చీరలు తదితర వెరైటీలకు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. నాణ్యత, మన్నికలతో వినియోగదారులకు మంచి సేవలు అందించడానికి తామే స్వయంగా స్వంత మగ్గాలు వినియోగిస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ నగరం వేదికగా ప్రారంభించిన మొదటి స్టోర్‌ కొత్తపేటతో పాటు నగర ఫ్యాషన్‌ ప్రియులను ఆకర్షించడం ఆనందంగా ఉందన్నారు.
        ఈ గ్రాండ్‌ ఓపెనింగ్‌ కార్యక్రమానికి ఫ్యాషన్‌ ప్రియులు, పలువురు స్థానిక ప్రముఖులు, విభిన్న వేదికల వస్త్ర ప్రేమికులు హాజరయ్యారు. విలాసవంతమైన షాపింగ్‌ అనుభవాన్ని, విభిన్న కలెక్షన్స్‌ను అన్వేషించే వారికి, ఆస్వాదించేవారికి అషు సిల్క్స్‌ ఎంపోరియం ఏకైక వేదికగా ఆహ్వనం పలుకుతుంది.