రేపు సూపర్వైజర్లు.. సహాయకులకు శిక్షణ తరగతులు

– ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రవణ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు పై ఈనెల 2 న ఉదయం 9:30 గంటలకు నోడల్ అధికారులకు, 11:30 గంటలకు ఓట్ల లెక్కింపు సూపర్వైజర్లు, సహాయకులకు జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణ లోని ఉదయాదీత్య భవన్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటు ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు ఎన్నికల సూక్ష్మ పరిశీలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, అందువల్ల నోడల్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లు తప్పనిసరిగా వారికి కేటాయించిన సమయంలో శిక్షణ కార్యక్రమాలకు హాజరుకావాలని, ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.