రేపు సీఎం రేవంత్, మంత్రి దుద్దిళ్ల మెడిగడ్డ పర్యటన

– మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
రేపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాలేశ్వరం మేడిగడ్డ ఎత్తిపోతల పథకంలో జరిగిన అవినీతిని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపెట్టడానికి మేడిగడ్డ సందర్శన కార్యక్రమం ఉంటుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం సందర్శించనున్నారు. కావున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా సోదరీమణులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.