
– భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్
నవతెలంగాణ – మల్హర్ రావు
పవిత్ర రంజన్ మాసం పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని జమా మసిద్ లో రేపు ఇస్తార్ విందు నిర్వహించడం జరుగుతుందని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు జమా మసిద్ లో ముస్లిం సోదరులకు ఇస్తార్ విందు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,వివిధ శాఖల అధికారులు,మీడియా మిత్రులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.