నవతెలంగాణ – ఖమ్మం: కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ రెడ్డి ఉద్యోగుల ( గ్రేట్ ) ఆత్మీయ సమ్మేళనం ఖమ్మంలోని మలీదు జగన్ (కార్పొరేటర్) మామిడి తోటలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ కె . సత్యనారాయణరెడ్డి, దగ్గుల మాధవరెడ్డి, వై. శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బల్లేపల్లి ఎస్ఎఫ్ఎస్ పాఠశాల పక్కనుండి బ్లూమింగ్ మైండ్స్ స్కూల్ కి వెళ్లే దారిలో ఉన్న ఈ మామిడి తోటలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు చెప్పారు. ప్రభుత్వ రెడ్డి ఉద్యోగులలో ఐక్యత, స్నేహభావం పెంపొందించేందుకు ఈ వేడుక ఉపయోగపడుతుందనే భావనతో ప్రతీ సంవత్సరం దీని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తామని అన్నారు. గ్రేట్ వనమహోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఖమ్మంలోని ప్రభుత్వ రెడ్డి ఉద్యోగులతో పాటు ఆహ్వానితులు ఈ కార్యక్రమానికి హాజరై, విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో గ్రేట్ బాధ్యులు గాదె మాధవరెడ్డి, బైరెడ్డి పుల్లారెడ్డి (టీచర్ ) , జంగా నాగార్జునరెడ్డి, బైరెడ్డి పుల్లారెడ్డి, రావుల శ్రావణ్ రెడ్డి , యరమల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.