రేపటి శోభాయాత్రను జయప్రదం చేయాలి

నవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాదు ప్రజలకు తేదీ 23-04-2024 నాడు ఉదయము నుండి రాత్రి వరకు హనుమాన్ జయంతి శోభ యాత్ర చేయడం జరుగును అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదివారం ప్రకటనలో తెలియజేశారు. శోభాయాత్రలో దేవత విగ్రహము మరియు పెద్ద సంఖ్య లో భక్తులు వచ్చి పాల్గొనే అవకాశం ఉన్నందున, ముఖ్యంగా లలితమహల్ రైల్వే గేట్, గంజ్ గేట్ నెంబర్-2, గోదాం రోడ్, దేవి రోడ్, మమతా సర్కిల్, గాంధీ చౌక్, నెహురు పార్క్, పెద్ద బజార్ లక్ష్మి మెడికల్ ఆర్ ఆర్ చౌరస్తా వరకు గల దుకాణ యజమానులు మరియు నివాసము ఉండే వారు తేదీ 22-04-2024 నాడు రాత్రి 8 గంటల నుండి తేదీ 24-4-2024 నాడు ఉదయము 6 గంటల వరకు తమరి వాహనాలను శోభ యాత్ర వెళ్లే మార్గంలో రోడ్డు పైన పార్క్ చేయరాదు మరియు ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలిగించరాదని మా యొక్క విన్నపము, ఇలా మాయొక్క విన్నపాన్ని పాటించని వారిపై చట్ట రీత్యా చర్య తీసుకోబడును అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలియజేశారు.