కుండపోత వర్షం..

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని బుదవారం నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రైతులు వేసిన పంటలు నీట మునిగాయి. గురువారం మండల అధికారులు మాణిక్ బండారు 63వ జాతీయ రహదారిపై పారుతున్న నీటిని పరిశీలిస్తూ ప్రయాణికులను జాగృతం చేస్తున్నారు. పలు గ్రామాల్లో చెరువుల అలుగులను తొలగించి నీటిని వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. అధికారులతో పాటు జిల్లా జెడ్పీ చైర్మన్ డీ. విఠల్ రావు వెంకటాపూర్, అమ్రాద్ తండా, మాణిక్ బండార్ గ్రామాలను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. మనిక్ బండారు కామన్ వద్ద నిలిచిన నీటి వల్ల ప్రజలు అనేక అయిబ్బందులను ఎదుర్కొంటున్నారని తహశీల్దార్ శంకర్, ఎస్సై సుదీర్ రావు అక్కడే ఉంది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేస్తున్నారు. ఈ ఆర్డీఓ రవి, ఎంపిడిఓ క్రాంతి, ఇరిగేషన్ ఇఇ రవికుమార్, ఏఇ దివ్య భారతి, పంచాయతీ రాజ్ ఏఈ శ్రీనివాస్ స్థానిక సర్పంచులు గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.