కోదాడలో కుండపోత వర్షం..

Heavy rain in Kodada– పలు కాలనీలోకి వరద నీరు.. ఇబ్బందులు పడ్డ పట్టణ ప్రజలు..

– బాలికల వసతి గృహంలోకి వర్షపు నీరు..
– నీటి ప్రవాహ ధాటికి కొట్టుక పోయిన కార్లు ఆటోలు..
– నీటి ప్రవాహ దాటికి ఇద్దరు వ్యక్తులు మృతి..
– మూగ జీవాలను కూడా వదలని వరద..
నవతెలంగాణ – కోదాడరూరల్ 
అతి భారీ వర్షానికి కోదాడలో పరిస్థితి దారుణంగా తయారైంది. ఎటు చూసినా కన్నీటి గాథలే … ఇప్పటికే జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలకు భారీ వర్షం నీటి ప్రవాహంతో ఇల్లు మునుగుతున్న బిక్కుబిక్కుమంటూ మోకాళ్ళ లోతు నీటిలో అర్ధాకలితో చీకటిలోనే శనివారం రాత్రి మొత్తం గడిపారు. భారీ వర్షానికి ఎటు చూసినా వర్షపు నీరే .. పట్టణంలోని హుజూర్నగర్ వెళ్లే ప్రధాన రహదారి ఎర్రకుంట చెరువుకి వెళ్లే కాలువ ఉదృతంగా ప్రవహించడంతో ఆ ప్రవాహ దాటికి రెండు కార్లు, రెండు ఆటోలు,ద్విచక్ర వాహనాలు కొట్టుకొని పోయినాయి. కారు లో ఓ వ్యక్తి మృతి చెందాడు ఆ వ్యక్తిని పట్టణానికి చెందిన రవి(45)గా గుర్తించారు. ఆటోలలో ద్విచక్ర వాహనాలలో కోట్టుకపోయిన వారి సంగతి తెలియ రాలేదు.పట్టణంలో  అనేక ఇండ్లలోకి నీరు అపార్ట్మెంట్ సెల్లార్ లో కి వర్షపు నీరు చేరింది.. దీంతో యజమానులు ట్రాక్టర్ల సహాయంతో ఆ వర్షపు నీటిని తోడారు. పట్టణంలోని బాలికల వస్తీగృహంలోకి భారీ వర్షానికి వరద పోటెత్తడంతో బాలికలను బస్సులు సహాయంతో మరొక వసతి గృహానికి తరలించారు. వరద దాటికి పశువులు కూడా కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి. మున్సిపల్  కార్యాలయంలోకి నీరు చేరడం వల్ల పలు రికార్డులు విలువైన సామాన్లు మొత్తం వర్షపు నీటి మయమయ్యాయి. పట్టణంలోని  ఎర్రగుంట చెరువు వెళ్లే కాలువ మొత్తం ఆక్రమణకు గురికవడంతో ఆ నీరు శ్రీమన్నారాయణ కాలనీ మీదుగా హుజూర్నగర్ రోడ్డు మీదుగా ప్రవహించింది ఆ ప్రవాహ దాటికి ఓ వ్యక్తి ద్విచక్ర వాహనం దారుడు గల్లంతయ్యాడు.
హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు పోలీసులు శాఖ  అతడిని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిది లోని 10 వ వార్డ్ ( కొమరబండ ) లో ఉన్న బ్రాంచి తపాలా కార్యాలయం, పశువుల హాస్పటల్, బస్తీ దవాఖాన,అంగనవాడి , ఇతర ప్రాంతం పూర్తి గా నీటి ప్రవాహం తొ చెరువును తలపిస్తున్నాయి.  పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహం వద్ద వరద దాటికి మరొక వ్యక్తి మృతి చెందాడు. పట్టణానికి చెందిన వ్యక్తిగా  అతని పేరు వెంకటేశ్వర్లు (50)గా గుర్తించారు. కోదాడ పెద్ద చెరువు అలుగు పారాడంతో అనంతగిరి మండలానికి కోదాడ మండలానికి రాకపోకలు అంతరాయం ఏర్పడింది. పట్టణంలోని శ్రీరంగాపురం సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న వినాయక విగ్రహాల లోకి వరద నీరు చేరింది. దీంతో ముందు అడ్వాన్స్ ఇచ్చిన విగ్రహాలు వరద దాటికి కొట్టుకునిపోయాయని , సుమారు 30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి మొత్తం విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో పట్టణంలో మంచినీటి కొరత ఏర్పడింది. మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు సత్వరమే స్పందించి రాత్రిపూట వరద వరద నీటికి అడ్డుగా ఉన్న డివైడర్లను సైతం కూలగొట్టి నీటిని క్రింద వైపుకు పంపించారు.
ముంపు ప్రాంతాలను సందర్శించిన జిల్లా కలెక్టర్..
కోదాడలో వర్ష బీభత్సానికి గురైన వార్డులను జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్ ఆదివారం ఉదయం పరిశీలించారు. వరదను అరికట్టడానికి చేపట్టవలసిన చర్యలను వరద బీభత్సవానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు చేపట్టాల్సిన పునరావాస చర్యలపై కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణకు తాసిల్దార్ సూరయ్యకు ఆదేశాలు జారీ చేశారు .అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రాణహాని జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ ,కమిషనర్ రమాదేవి ,బిజెపి నాయకులు హనుమంతరావు, పలువురు వార్డు కౌన్సిలర్లు ఉన్నారు.