
పట్టణ శివారులోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వచ్చిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఎల్లమ్మ దేవాలయం కమిటీ ఛైర్మన్ తోటకూర వెంకటేష్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయితే 101 కొబ్బరికాయ కొడతాను అన్న మొక్కును ఈరోజు తీర్చుకున్నారు. అనంతరం భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ పోత్తంశెట్టి వెంకటేశ్వర్లు కు ఆలయ ఛైర్మన్ ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి రేణుక ఎల్లమ్మ తల్లి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్ వడిచర్ల లక్ష్మి కృష్ణ యాదవ్ , కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.