దేశవ్యాప్త కార్యాకుల సమ్మెకు టీయూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంపూర్ణ మద్దతు..

నవతెలంగాణ – డిచ్ పల్లి
దేశవ్యాప్త కార్యాకుల సమ్మెకు తెలంగాణ యూనివర్సిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంపూర్ణ మద్దతు ను ప్రకటించారు.శనివారం యూనివర్సిటీ లోని ఆర్ట్ సైన్స్ కళాశాల వద్ద ఐఎఫ్టియు అద్వర్యంలో యూనివర్సిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి పి బికోజి అద్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్యల ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని,  సుప్రీం కోర్టు సమానపనికి సమాన వేతనం చెల్లించాలని అదేశాలు ఇచ్చిన అవి నేటి వరకు అమలు కావడంలేదని,గత 17 ఏళ్ళ నుండి శ్రమ దోపిడికి గురవుతున్నారని అయన అవేదన వ్యక్తం చేశారు. యునివర్సిటీ అబివృద్ధి కోసం పోరుగు సేవల ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు.అనునిత్యం చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే ఉద్యోగులను రెగ్యులరైజేషన్ ఉన్న చేయలని లేని యెడల రానున్న రోజులలో ఉద్యోగులందరు కలసి పెద్ద యెత్తున్న సమ్యెలో పాల్గంటామని హెచ్చరించారు. ఈనెల 16 న దేశవ్యాప్త సమ్మెకు పోరుగు సెవల ఉద్యగులు సంపూర్ణంగా మద్దతు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో  ఐఎఫ్టియు నాయకులు దివ కూమార్, ఉద్యోగులు, మదులిక, సురేష్, రవీందర్ నాయక్, బబ్లు
నవ్య, ఆశోక్ తదితరులు పాల్గొన్నారు.