
– దామన్న లో కనిపించిన టిక్కెట్ జోష్,
– ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు.
నవ తెలంగాణ-సూర్యాపేట.
సూర్యాపేట టిక్కెట్ కోసం మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి గత కొన్ని రోజులుగా హైదరాబాద్, ఢిల్లీ పర్యటనలతో బిజీగా ఉన్న ఆయన సోమవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి వచ్చారు.ఈ సందర్భంగా స్థానిక రెడ్ హౌస్ వద్ద నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి గజమాలలు,శాలువలతో స్వాగతం పలికారు. ప్రధానంగా టిక్కెట్ దామన్న దే అనే జోష్ తో కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత దామోదర్ రెడ్డి పట్టణానికి రావడంతో నియోజకవర్గంలోని పలు మండలాలు,గ్రామాల నుండి ప్రజాప్రతినిధులు,నాయకులు రెడ్ హౌజ్ కు తరలి వచ్చి దామన్న తో ఆత్మీయ ఆలింగనం చేసుకొని ఘనంగా సత్కరించారు. కాగా మంగళవారం ఆర్డిఆర్ పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. గుండెపోటు తో అకాల మృతి చెందిన కాంగ్రెస్ నాయకులు నామ ప్రవీణ్ నివాసానికి ఆయన చేరుకొని పార్దివ దేహం పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం ఒక కేసు నిమిత్తమై స్థానిక కోర్టుకు హాజరు అయ్యారు. అనంతరం ఇక్కడే బార్ అసోసియేషన్ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన జిల్లా కాంగ్రెస్ నాయకులు చంచల శ్రీనివాస్ కుమారుడు నిఖిల్ వివాహం అయిన సందర్భంగా వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులకు అభినందనలు తెలిపారు. తర్వాత అనారోగ్యంతో మృతి చెందిన డాక్టర్ యూసుఫ్ నివాసానికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శిరంశెట్టి పప్పి తండ్రిగారైన సీతారాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం స్థానిక శ్రీలక్ష్మి గార్డెన్స్ లో కాంగ్రెస్ నాయకులు సట్టు వెంకన్న కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు. అదేవిధంగా సూర్యాపేట మండలం కెటి అన్నారం గ్రామానికి చెందిన కొడిదల గోపాల్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.సాయంత్రం పట్టణంలోని సాయి గణేష్ హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న చివ్వేంల మండలం సూర్య నాయక్ తండా గ్రామానికి చెందిన ధారవత్ చందు కుమార్తెను పరామర్శించారు.అదేవిధంగా స్థానిక రామ్మూర్తి హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆకుల బుచ్చిబాబు ని పరామర్శించి ఆయన బాగోగులు గురించి తెలుసుకున్నారు.ఈ విధంగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన ఆప్తులను పలకరిస్తూ సుడిగాలి పర్యటన చేశారు.దామన్న రాకతో కార్యకర్తలో హుషారు కనిపించింది. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణా రెడ్డి,డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అంజాద్ అలీ,