
– ఆశీర్వాదాలు, అభినందనలు,పరామర్శలతో బిజీ బిజీ..
– కోయరంగాపురంలో ఘనస్వాగతం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
సెలవు రోజు సైతం స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రజలతో గడుపుతున్నారు. ఆదివారం అశ్వారావుపేట మండలంలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టారు. పలువురు బాధితులకు ఓదార్పు లు,మృతుల కుటుంబాలకు పరామర్శలు,నూతన వధూవరులకు ఆశీర్వాదాలు,విజయాలు సాధించిన వారికి అభినందనలు తెలుపుతూ రోజంతా బిజీ బిజీ గా ప్రజలతో మమేకం అయ్యారు. కోయరంగాపురంలో గిరిజనులు వారి సాంప్రదాయ పద్దతిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు కొమ్ములు తొడిగి,గిరిజన నృత్యం తో ఘన స్వాగతం పలికారు. మండలం లోని తిరుమలకుంట లో ఇటీవల ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో పూరి ఇళ్ళు దగ్ధం అయిన పొట్ట రంగారావు కుటుంబాన్ని ఓదార్చి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని గృహ లక్ష్మీ పథకంలో ఇల్లు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఇదే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఈ మధ్య కాలంలో వెలేరుపాడు మండలంలో ఆటో ప్రమాదానికి గురై గాయపడిన
కొనకళ్ళ రాజమ్మ,కొర్స మహేశ్వరీ,మొడియం అక్కమ్మ,మాడి బోడెమ్మ లను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని ఆర్థిక సహాయం చేసి,మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తానని బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ గ్రామంలోనే ఇటీవల వేర్వేరు కారణాలతో,వేర్వేరు సమయాల్లో ఆకస్మికంగా మృతి చెందిన కోన సత్యనారాయణ,కోణ భాస్కర్ రావు ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.మరణాన్ని గల కారణాలను కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకుని సానుభూతి తెలిపారు. నందిపాడు లో పద్దం కృష్ణారావు కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కోయ రంగాపురం కు చెందిన జల్లి లక్ష్మయ్య కుమార్తె నాగ శ్రీ నూతన వస్త్రాల అలంకరణ వేడుకకు హాజరై నాగ శ్రీ ని ఆశీర్వదించి అక్షింతలు వేసి దీవించారు. ఈ గ్రామంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు గిరిజన సాంప్రదాయ తలపాగా ధరింప జేసి కొమ్ము నృత్యాలతో సాదరంగా గ్రామంలోకి ఆహ్వానించి గ్రామస్తులు అభిమానాన్ని చాటుకున్నారు.