బుద్ధవనంను సందర్శించిన టూరిజం ఎండి రమేష్ నాయుడు

– బుద్ధవనంలోరూ.40కోట్లతో అభివృద్ధి పనులు
– బుద్ధవనంను ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దుతాం
నవతెలంగాణ – నాగార్జునసాగర్
నాగార్జునసాగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధ వనమును టూరిజం ఎండి రమేష్ నాయుడు మంగళవారం సందర్శించి బుద్దావనంలో చేపడుతున్న పనులను అధికారులను తెలుసుకున్నారు. అనంతరం బుద్ధ చరిత వనం లోని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించి ప్రార్థనలు చేశారు. బుద్ధవనములోని బుద్ధ చరిత వనం, జాతక పార్కు, స్థూప పార్కులను,వ్యూ పాయింట్ లను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆచార్య నాగార్జునుడు నడియాడిన నేలలో బుద్ధవనాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని బుద్ధ వనం మరింత అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.బుద్ధవనంలో 15కోట్లతో  షాపింగ్ కాంప్లెక్స్, సోలార్ సిస్టం, ట్యాంకు నిర్మాణ పనులు జరుగుతున్నాయని స్వదేశీ దర్శన్  సెంట్రల్ ఇండియా స్కిం కింద విడుదల చేసిన 25 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ మ్యూజియం మరియు 3డి మ్యూజియంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బుద్ధ వనమును దేశ విదేశాల పర్యాటకులకు ఆకర్షించే విధంగా సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం విజయ విహార్ మరియు లాంచి స్టేషన్ ను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.వీరితో పాటు టూరిజం జి.ఎం ఉపేందర్ రెడ్డి,బుద్ధవనం ఓఎస్డీ సూదాన్ రెడ్డి, బుధవారం కన్సల్టెంట్ మరియు పురావస్తు నిపుణులు ఈమని శివ నాగిరెడ్డిని, సహాయ శిల్పి శ్యామ్ సుందర్,ఏ.ఈ నజిమ్ తదితరులు ఉన్నారు.